సోషల్ మీడియాలో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే.. మరికొన్ని భావోద్వేగానికి గురిచేసే వీడియోలు ఉంటాయి. అందులో ఇదొకటి.. జొమాటో డెలివరీ ఏజెంట్ తన పనిని ముగించి.. చీకటి పడ్డాక తన భార్య, కొడుకుతో పాటు ఇంటికి వెళుతుంటాడు. జొమాటో టీషర్టు వేసుకున్న వ్యక్తి పిల్లాడిని ఎత్తుకుని నడుస్తుండగా.. అతని భార్య సైకిల్ పట్టుకుని ముందుకు వెళ్తుంటారు.