ఢిల్లీలో జరుగుతున్న న్యాయ సదస్సులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి. లక్ష్మణ రేఖను దాటడం మంచిది కాదన్నారు. న్యాయమూర్తులు విధి నిర్వహణలో పరిధులు గుర్తించాలి. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థకు వేర్వేరు అధికారాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యం బలోపేతానికి 3 వ్యవస్థలు పనిచేయాలి. పిల్‌లు దుర్వినియోగం అవుతున్నాయి. పిల్‌లు వ్యక్తిగత వ్యాజ్యాలుగా మారాయన్నారు సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరం అన్నారు.…