ఇవాళ ఢిల్లీలో కీలక న్యాయ సదస్సు జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సుని ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ సదస్సుకి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ నుంచి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొంటారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొంటారు. సదస్సులో న్యాయస్థానాల్లో ఐటీ వినియోగం,…