Gautam Thapar: ‘అవంత’ గ్రూప్ ప్రమోటర్ మరియు సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ మాజీ చైర్మన్ గౌతమ్ థాపర్‌కి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 10 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ నుంచి నిధులను దారిమళ్లించారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో తుది ఆదేశాలను జారీ చేసింది.