మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో కోల్డ్ స్టోరేజీ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం వ్యవసాయ కళాశాలను కేటీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు అంబేద్కర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం, మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొంటారు.