బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. ఆయన ఫుట్ బాల్ కోచ్ గా నటించిన ‘ఝుండ్’ ట్రైలర్ విడుదల అయింది. ఈ సినిమా మార్చి 4న థియేటర్లలో విడుదల కానుంది. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న మరో బయోపిక్ మూవీ. ఇందులో అమితాబ్ ఎన్.జి.వో స్లమ్ సోకర్ ఫౌండర్ విజయ్ బర్సే పాత్రలో కనిపించనున్నారు. వీధిబాలలను ఫుట్ బాల్ టీమ్ గా తయారు చేసే ప్రొఫెసర్ పాత్రలో అమిబాబ్ జీవించారనే చెప్పాలి. 2019ల…