రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడం భయాందోళనలను కలిగిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమలో కరోనా చాప కింద నీరులా పాకుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కరోనా బారిన పడింది. బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ‘జెర్సీ’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ కరోనా బారిన పడింది. అందుతున్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్…
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ హిట్ సినిమా జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం షాహిద్ ఎంతగానో కష్టపడ్డాడు. ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 31న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ప్రముఖ ఓటిటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ రాగా…
షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘జెర్సీ’ మేకింగ్ వీడియో నిన్న విడుదలైంది. తెలుగులో నాని హీరోగా నటించిన సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ 2019లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ అదే పేరుతో ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. అయితే తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కావడం విశేషం. తాజాగా విడుదలైన సినిమా హిందీ ట్రైలర్ పై…
బాలీవుడ్ స్టార్ తో బన్నీ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం భారీగానే సన్నాహాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… “జెర్సీ” హిందీ ట్రైలర్ లాంచ్ నవంబర్ 23న జరిగింది. ప్రధాన తారలు షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్, మీడియా, ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ఊహించిన విధంగా…