2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో తాను ఏడవని రోజు లేదని, మానసికంగా సరిగ్గా లేనని స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపింది. సెమీస్‌లో జట్టు కోసం నిలబడాలనుకున్నానని, మిగిలినదంతా ఆ దేవుడే చూసుకున్నాడని పేర్కొంది. ఆస్ట్రేలియాపై గెలవడం పట్ల సంతోషాన్ని ఆపుకోలేకపోయానని, అందుకే మైదానంలోనే కన్నీళ్లు వచ్చాయని చెప్పింది. టీమిండియా గెలవడం పట్ల తాను ఒక్కదాన్నే క్రెడిట్‌ను తీసుకోవాలనుకోవడం లేదని, మ్యాచ్‌ను తాను ఒక్కదాన్నే గెలిపించలేదని జెమీమా చెప్పుకొచ్చింది. సెమీస్‌లో ఆసీస్ నిర్ధేశించిన 339 పరుగుల భారీ…