Masood Azhar: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు భారత అధికారులంటే ఎలాంటి భయమో స్వయంగా ఆయనే వెల్లడించాడు. 1990లలో జమ్మూ కాశ్మీర్ జైలులో ఉన్న అజర్, అక్కడి నుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేశారు. దీని తర్వాత తాను తీవ్రమైన ‘‘శిక్ష’’ను ఎదుర్కొన్నానని చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. నిఘా వర్గాలు కూడా ఈ ఆడియో క్లిప్ నిజమైందని నిర్ధారించాయి. పాకిస్తాన్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో అజర్…