ఏపీ ఛీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డితో స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియషన్ సభ్యుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ పెండింగ్ నిధులపై చర్చ జరిగింది. పెండింగ్ నిధులు విడుదల చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ జి.లక్షీశా మాట్లాడారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయమేమీ లేదని వెల్లడించారు. నెట్వక్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సానుకూలంగానే స్పందిస్తున్నాయని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల సేవలకు అంతరాయం కలిగించకుండా సహకరించాలని కోరినట్లు తెలిపారు. అన్ని నెట్వక్క్ ఆసుపత్రులూ సానుకూలంగానే స్పందిస్తున్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి గత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.3,566.22 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
READ MORE: TS ECET Counselling: ఈసెట్ అభ్యర్థులకు అలెర్ట్.. కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసిందోచ్..
ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో ఇప్పటి వరకు రూ. 366 కోట్లు నెట్వక్క్ ఆసుప్రతుల ఖాతాల్లో జమచేశామని స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధిదారులకు సేవలందాయని.. ఈనెల 22న 6718 మంది లబ్ధిదారులు, 23న 7118 మంది చికిత్స పొందారని వివరించారు. గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో రోజుకు సగటున 5349 మంది ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు పొందారన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ సకాలంలో వైద్యం అందుతోందన్నారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో గుర్తింపుపొందిన ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునేందుకు వెసులుబాటుందన్నారు. కాగా.. హాస్పిటల్స్ అసోసిషియన్ మీటింగ్ అనంతరం కార్యచరణ ప్రకటించనున్నట్లు హాస్పిటల్స్ వర్గాలు తెలిపాయి.