2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో ఊహించని విధంగా సీట్లు సంపాదించుకున్న ఇద్దరు నాయకులు ఎమ్మెల్యేలవడమేకాదు...నాటి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రులు కూడా అయ్యారు. అందులో ఒకరు చింతలపూడి నుంచి పీతల సుజాత కాగా... మరొకరు కొవ్వూరు నుంచి కె ఎస్ జవహర్. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే... సుజాత గనుల శాఖ మంత్రిగా అవకాశాన్ని దక్కించుకోగా...