Tim Southee hails Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై న్యూజిలాండ్ పేస్ బౌలర్ కమ్ కెప్టెన్ టిమ్ సౌథీ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత క్రికెట్‌లో బుమ్రా కంటే మరెవరూ బెటర్‌గా లేరని అభిప్రాయపడ్డాడు. తీవ్రమైన గాయంతో ఇబ్బందిపడిన బూమ్ బూమ్.. కోలుకొని వచ్చాక పునరాగమనం ఘనంగా చాటాడన్నాడు. ప్రస్తుతం బుమ్రా అత్యుత్తమ వెర్షన్‌ను చూస్తున్నామని సౌథీ చెప్పుకొచ్చాడు. బుధవారం ముంబైలో జరిగిన సియట్ అవార్డుల కార్యక్రమంలో సౌథీ పాల్గొన్నాడు. ‘తీవ్రమైన వెన్ను గాయంతో…