PV Sindhu Performance in 2025: ఈ సీజన్‌లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వైఫల్యం కొనసాగుతోంది. ఈ ఏడాదిలో సింధు తొలి రౌండ్లోనే ఐదవసారి ఓడిపోయింది. తాజాగా జపాన్ ఓపెన్ 2025 సూపర్ 750 టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన సిమ్ యు జిన్ చేతిలో వరుస గేమ్ ( 15-21, 14-21)లలో సింధు పరాజయం పాలైంది.…