Today(21-12-22) Business Headlines: దావోస్‌కు మంత్రి కేటీఆర్: తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కి వెళ్లనున్నారు. జనవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్నారు. ఇండియా నుంచి దాదాపు వంద మందికి పైగా హాజరుకానున్న ఈ సదస్సుకు తెలంగాణ నుంచి ప్రస్తుతానికి కేటీఆర్ పేరు ఒక్కటే తెర మీదికి వచ్చింది.
Human Washing Machine: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటోంది. ఒకప్పుడు చేత్తో బట్టలు ఉతికేవాళ్లు. ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పని. అయితే ఇప్పుడు వాషింగ్ మెషిన్ అందుబాటులో ఉండటంతో పని సులువుగా మారిపోయింది. వాషింగ్ మెషీన్ కారణంగా గృహిణీలకు పనిభారం కూడా ఎంతో తగ్గింది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ కాకుండా మనుషులను ఉతికే వాషింగ్ మెషిన్ కూడా రాబోతోంది. ఈ యంత్రాన్ని జపాన్‌కు చెందిన కంపెనీ…