దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇస్కాన్ టెంపుల్స్ కు భక్తులు పోటెత్తారు. చిన్న పిల్లలు శ్రీకృష్ణుడి,గోపిక వేషాధారణలో మంత్ర ముగ్ధులను చేస్తున్నారు. భక్తులు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లో రాధా-కృష్ణుల మనోహరమైన రూపం భక్తులకు కనువిందు చేసింది. శ్రీ కృష్ణుడు, రాధా విలువైన ఆభరణాలతో అలంకరించబడ్డారు. రాధా-కృష్ణుల విగ్రహంలో కనిపించే ఆభరణాలు కోట్ల విలువైనవి. బంగారు కిరీటం, వజ్రాలు పొదిగిన.. రూ.…
శుక్రవారం జన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో గల ఓ ఆలయంలో జన్మాష్టమి వేడుకల సందర్భంగా రద్దీ కారణంగా ఇద్దరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించారు. ప్రసిద్ధ హిందూ పండుగ జన్మాష్టమిని జరుపుకోవడానికి తాను తన భార్యతో కలిసి ఆలయాన్ని సందర్శించినట్లు ఓ చిత్రాన్ని రిషి సునాక్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం జన్మాష్టమి వేడుకలు ప్రారంభం కావడంతో మధురలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నగరంలోని ఆలయాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు.