టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై చాలా కేసులున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు స్టేలు తెచ్చుకొని నెట్టుకొచ్చారు.. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తప్పించుకోలేకపోయారు అని ఆయన విమర్శించారు.
అమరావతిలో పార్టీ కార్యకర్తలతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలోని ప్రతీ ఒక్కరూ పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీ కంటే ఎక్కువ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించమని ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
Stunt man sri badri contibutes to jansena: జనసేనకు స్టంట్ మేన్ శ్రీ బద్రి విరాళం ఇచ్చిన అంశం హాట్ టాపిక్ అయింది. బుధవారం సాయంత్రం స్టంట్ మెన్ శ్రీ బద్రి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో భోళాశంకర్ సినిమాలో చేసిన స్టంట్స్ కి గాను తాను అందుకున్న పారితోషికం రూ. 50 వేలు జనసేన పార్టీకి విరాళంగా అందచేశారు బద్రి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ శ్రీ…
నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. వినోద్ రెడ్డితో వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చర్చలు జరిపి పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో ఆయన అంగీకరించారు.
విశాఖలో వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. దసరా నుంచి రాజధాని కార్యకలాపాలను స్వాగతిస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అందులో భాగంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దసరా నుంచి పరిపాలన ప్రారంభిస్తున్న సీఎంకు మద్దతుగా నిలుద్దామని తెలిపారు. మరోవైపు టీడీపీపై ఆయన విరుచుకుపడ్డారు. 2014-19 మధ్య రాష్ట్ర ఖాజానాను టీడీపీ నాయకత్వం దోచేసిందని విమర్శించారు.