జనసేన పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది.. ఈ నెల 12,13,14 తేదీల్లో జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్లపై జనసేన పార్టీ సోషల్ ఆడిట్ చేపట్టబోతోంది… మూడు రోజుల పాటు జనసేన నిర్వహించే సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నారు.. రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో జరిగే సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించారు.. అంతేకాదు.. మరో ఒకట్రొండు చోట్ల కూడా పాల్గొందామా..? వద్దా..? అనే అంశంపై పవన్ కల్యాణ్…
నవంబర్ 12, 13, 14 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో పక్కాగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్.. దీని ద్వారా కొత్త తరహాలో సమస్యలు వెలికితీస్తామని వెల్లడించారు.