ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై జనసేన ప్రత్యేక ఫోకస్ పెట్టిందట. ఇప్పటివరకు పార్టీ ప్లస్ లు మైనస్ లు అంచనాలు వేసుకున్న నేతలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారట. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఓట్లు సీట్లలో పీఆర్పీ ఉనికి చాటుకుంది. మొత్తం 19 స్థానాలుగాను నాలుగుచోట్ల గెలవగా, 8 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 5 చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు చీల్చింది ప్రజారాజ్యంపార్టీ. గత ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలులో పోటీ చేసినప్పటికీ జనసేన ఒక్కచోటే…