‘జనం బాట’ కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమవుతున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 13 జిల్లాల్లో జనం బాట కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, ఇంకా 20 జిల్లాలు తిరగాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలుగుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రజల్లో ముఖ్యంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని కవిత తెలిపారు.…