2019 ఆగష్టులో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రాష్ట్ర హోదాను రద్దుచేసి లడక్‌ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటి జాతీయ స్థాయి రాజకీయ చర్చ జరిగింది. ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ ఒమర్ అబ్దుల్లాలు, గులాం నబీ ఆజాద్, మెహబూబా ముఫ్తిలతో పాటు బిజెపి నేత రవీంద్రరైనా నిర్మల్ సింగ్, సిపిఎం నాయకుడు ఎంఎల్‌ఎ యూసప్ తరగామి, ఆప్…