Amarnath Yatra: ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న పవిత్ర అమరనాథ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగనున్న 38 రోజుల యాత్రను 581 కేంద్ర సాయుధ పోలీసు (CAPF) బలగాలతో, జామర్లు, డ్రోన్లతో కాపాడనున్నారు. ఏప్రిల్ 22న పహల్గాం దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన నేపథ్యంలో, ఈసారి యాత్రపై పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.…
ఢిల్లీలోని పాలికా బజార్‌లోని ఓ దుకాణంలో రెండు చైనీస్ మొబైల్ జామర్‌లు స్వాధీనం చేసుకోవడంతో కలకలం రేగింది. ఈ జామర్ల సామర్థ్యం 50 మీటర్లు. ఈ సంఘటనపై షాపు యజమాని రవి మాథుర్‌ను అరెస్టు చేశారు. ఈ జామర్‌ను లజ్‌పత్‌రాయ్ మార్కెట్ నుంచి రూ.25 వేలకు కొనుగోలు చేసినట్లు రవి తెలిపాడు.