కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం “జేమ్స్” విడుదలకు భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పునీత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘జేమ్స్’ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పునీత్ చేసిన యాక్షన్ స్టంట్స్ వీక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నిర్మాణ విలువలు, విజువల్స్ అదిరిపోయాయి. ట్రైలర్ చూస్తుంటే ‘జేమ్స్’ పునీత్ అభిమానులకు తప్పకుండా చిరకాలం గుర్తుండిపోయే…