James Anderson Retirement: ఇంగ్లండ్ సీనియర్ పేసర్, స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు జిమ్మీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న అండర్సన్.. త్వరలోనే టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోనున్నాడు. జూలై 10 నుంచి లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టెస్టు తనకు చివరిదని చెప్పాడు. పేస్ బౌలర్ అయిన జిమ్మీ రెండు దశాబ్దాల పాటు…