ఈజీగా డబ్బు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు నకిలీ నోట్ల ప్రింటింగ్ కు పాల్పడుతున్నారు. దొంగనోట్లను ముద్రించి గుట్టుచప్పుడు కాకుండా చలామణిలోకి తీసుకొస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్ పూర్ లో దొంగ నోట్లు కలకలం రేపాయి. సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్ల చలామణి అయినట్లు అధికారులు గుర్తించారు. కెనరా బ్యాంక్ లో క్రాప్ లోన్ కట్టడానికి వెళ్లిన జలాల్ పూర్ గ్రామానికి చెందిన రైతు చిన్న సాయిలు వద్ద రూ.2 లక్షల 8వేల…