కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లిజో మోల్ జోస్, మణికందన్ ప్రధాన పాత్రలు పోషించిన కోర్ట్ డ్రామా ‘జై భీమ్’. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ప్రేక్షకుల నుంచి సెలెబ్రిటీల దాకా ఈ సినిమాకు జై కొడుతున్నారు. ఐఎండిబిలో టాప్ 250 సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుని హాలీవుడ్ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఇప్పటి వరకూ ఐఎండిబిలో మొదటి స్థానంలో ఉన్న కల్ట్ క్లాసిక్ ‘ది షాశాంక్ రిడంప్షన్’ను…