విజయవాడ నగరంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జై భారత్ పార్టీల రాష్ట్ర స్ధాయి పొలిటికల్ సెమినార్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సమావేశానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ హాజరయ్యారు.
ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగునున్న తరుణంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మేనిఫెస్టో ప్రకటించింది. కాగా.. ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు జేడీ లక్ష్మీనారాయణ సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులు, నిరుద్యోగుల కోసం పలు హామీలు ఇచ్చారు. వీటిని పక్కాగా అమలు చేస్తామన్నారు. ఈ మ్యానిఫెస్టోను ఆయా వర్గాలతోనే విడుదల చేయించడమే…