Ram Temple consecration: అయోధ్యలో జనవరి 22న భవ్య రామాలయ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ వేడక కోసం దేశవ్యాప్తంగా రామ భక్తులు, హిందువులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో మారుమోగుతోంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు 7000 మంది ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే యోగి ప్రభుత్వం అయోధ్యతో పాటు ఉత్తర్ ప్రదేశ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేసింది.