NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లో 111వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ముంబయి నేపథ్యంలో సాగే పవర్ఫుల్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ భారీ కమర్షియల్ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ రోల్ కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో మంచు మనోజ్ బాలకృష్ణను ఢీకొట్టే పవర్ఫుల్ విలన్‌గా నటిస్తున్నాడు. కాగా నేడు నటసింహం పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నా ఎదురుచూపులకు సమయం ముగిసింది. బాలయ్య సృష్టించబోయే ఇంపాక్ట్‌కు మాత్రం ఈసారి ఎలాంటి హద్దులు లేవు. బాలయ్య బాబు 111వ చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ ను ఈరోజు సాయంత్రం 5:40 గంటలకు విడుదల చేయబోతున్నారు. “ఒక సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది.. మునుపెన్నడూ చూడని విధంగా సెలబ్రేషన్స్ ఉండేలా గేర్ అప్ అవ్వండి” అంటూ చిత్ర యూనిట్ అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో రాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గోపీచంద్ మలినేని ఎలివేషన్స్ తోడైతే ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పక్కా అని చెప్పొచ్చు.
Also Read
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
- Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?