తెలుగు చిత్రసీమలో ఎంతోమంది నిర్మాతలు తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించి, జనం మదిలో నిలచిపోయారు. అలాంటి వారిలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ స్థానం ప్రత్యేకమైనది. నిర్మాతగానే కాకుండా, దర్శకునిగానూ రాజేంద్రప్రసాద్ ఆకట్టుకున్నారు.