బలూచిస్తాన్‌లోని బోలాన్ జిల్లా సమీపంలో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలును మంగళవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపి హైజాక్ చేశారు. ఈ చర్యతో పాక్ ఉలిక్కిపడింది. వెంటనే రంగంలోకి దిగిన పాక్ సైన్యం రెస్య్కూ ఆపరేషన్ ప్రారంభించింది. మిలిటెంట్లు బంధించిన పాక్ ప్రజలను విడిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ దాడికి పాల్పడింది తామేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. పాక్ సైన్యం ఇప్పటివరకు 16 మంది BLA మిలిటెంట్లను హతం చేసినట్లు తెలిసింది.…