ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఓపెన్‌గానే విమర్శలు చేసుకుంటున్నారు నాయకులు. ఇప్పుడు మంత్రుల బస్సుయాత్ర సైతం జేసీ, పల్లెల మధ్య మాటల మంటలు రాజేస్తున్నాయి. వాటి చుట్టూనే ప్రస్తుతం రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జిల్లాకు వచ్చారు. ఆ సమయంలో వేదికపై జేసీ…