నా కొడుకుకి సీటు కావాలన్నా నేను ఇవ్వలేను, అంతా ఆన్లైన్ అడ్మిషన్స్ అని అన్నారు మంత్రి మల్లా రెడ్డి. కల కన్నా.. నిజం చేసుకున్న.. నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరని అన్నారు. మెడికల్ కాలేజీ కట్టి .. ఆరేళ్ళు నష్టపోయిన ఇబ్బంది పడ్డా అని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వాళ్ళకి, వేరే పార్టీ అని అనుమతి ఇవ్వలేదని అన్నారు.
నేను క్యాసినో నడిపించట్లేదు, కాలేజీ నడిపిస్తున్నానని మంత్రి మల్లా రెడ్డి అన్నారు. ఐటీ రైడ్ చేశారు, నేను భయపడలేదన్నారు. 400 మంది వచ్చారు, వాళ్ల పని వాళ్ళు చేసుకుని వెళ్లారని తెలిపారు. మేము బయపడము, 33 కాలేజీలు నడిపిస్తున్న, నాది సింపుల్ లైఫ్.. హై థింకింగ్ అన్నారు మల్లారెడ్డి.