Malla Reddy: నేను క్యాసినో నడిపించట్లేదు, కాలేజీ నడిపిస్తున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malla Reddy: నేను క్యాసినో నడిపించట్లేదు, కాలేజీ నడిపిస్తున్నానని మంత్రి మల్లా రెడ్డి అన్నారు. ఐటీ రైడ్ చేశారు, నేను భయపడలేదన్నారు. 400 మంది వచ్చారు, వాళ్ల పని వాళ్ళు చేసుకుని వెళ్లారని తెలిపారు. మేము బయపడము, 33 కాలేజీలు నడిపిస్తున్న, నాది సింపుల్ లైఫ్.. హై థింకింగ్ అన్నారు మల్లారెడ్డి. 300 గజాల స్థలంలో నా ఇల్లు ఉందన్నారు. వందల మంది డాక్టర్స్.. ఇంజనీర్లు తయారు చేస్తున్నాఅని అన్నారు. అందుకే చిన్న ఇంట్లో ఉంటున్న అని తెలిపారు. నా కొడుకుకి సీటు కావాలన్నా నేను ఇవ్వలేను, అంతా ఆన్లైన్ అడ్మిషన్స్ అని అన్నారు మంత్రి మల్లా రెడ్డి. కల కన్నా.. నిజం చేసుకున్న.. నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరని అన్నారు. మెడికల్ కాలేజీ కట్టి .. ఆరేళ్ళు నష్టపోయిన ఇబ్బంది పడ్డా అని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వాళ్ళకి, వేరే పార్టీ అని అనుమతి ఇవ్వలేదని అన్నారు.
Read also: Andhra Pradesh: ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు.. నాలుగు జిల్లాలకు హెచ్చరికలు
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
రెండు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నానని అన్నారు. బ్లాక్ మెయిలర్స్ ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ఎంబీబీఎస్ బ్యాచ్ లు రాకుండా రాజకీయ బ్లాక్ మెయి లైర్స్ చేశారని అన్నారు. తుఫాన్ లు వచ్చినా తట్టుకుంటా అనే దైర్యం వచ్చిందని తెలిపారు. పాల వెండర్ గా ఈ స్థాయికి వచ్చినా అని పేర్కొన్నారు. ఫారిన్ ఫండ్స్ రాలేదని, కష్టపడ్డా సాధించా అన్నారు మంత్రి. కేసీఆర్ నాకు యునివర్సిటీ ఇచ్చారని, డబ్బులు ఉంటే బిల్డింగ్స్ కట్టొచ్చు కానీ మంచి ప్రొఫెసర్స్ రారని మల్లరెడ్డి అన్నారు. గాంధీ, ఉస్మానియా తరవాత మా కాలేజీనే అంటూ పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్ కష్టపడితే ఎంబీబీఎస్ పాస్ ఐనట్టే అని తెలిపారు. మెడికల్ కాలేజీలో డొనేషన్స్ లేవని, అంతా ఆన్లైన్ అడ్మిషన్స్ అన్నారు.
Read also: JP Nadda: దక్షిణాదిపై ఫోకస్.. మరోసారి తెలంగాణకు జేపీ నడ్డా..
తన కొడుకుకి సీటు కావాలన్నా నేను ఇవ్వలేనని అన్నారు. బర్త్ డే లు పిక్నిక్స్ ఉండొద్దనిచ పిల్లలను పాడు చేసేది పేరెంట్స్ అని అన్నారు. కొన్ని సాధించాలి అంటే కొన్నింటికి దూరం ఉండాలని తెలిపారు. ప్రేమ.. ఫ్రెండ్ షిప్ అన్నిటికీ దూరం ఉండాలని పేర్కొన్నారు. నేను ఏది దాచుకోను, భూమి అమ్మి కొడుకును ఎంబీబీఎస్ చేపించా అన్నారు మల్లారెడ్డి. ఎంపీ, ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి అయ్యానని అన్నారు. నాకు ఎలాంటి కోరికలు లేవని స్పష్టం చేశారు. ఒక డాక్టర్ ను చదివిస్తే కోడలుగా మరో డాక్టర్ గిఫ్ట్ గా వచ్చిందని అన్నారు. రెడ్డి అమ్మాయిని చేసుకుంటే కిట్టి పార్టీలు, పిక్నిక్ లు వెళ్ళేదని సంచళన వ్యాఖ్యలు చేశారు. నా కోడలుకు అమ్మ నాన్న లేరు, నాకు కోడలు మూడో కొడుకు లాగా అని మంత్రి మల్లా రెడ్డి వ్యాఖ్యానించారు.
Read also: Kurnool Live: కర్నూలులో రాయలసీమ గర్జన లైవ్ అప్‌డేట్స్
మల్లా రెడ్డి మెడికల్ కాలేజీ డైరెక్టర్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ.. మా కాలేజీ పై చాలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అడ్మిషన్స్ పారదర్శకంగా చేస్తున్నామని తెలిపారు. ఆరోపణలపై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. విద్యార్థులే మా కాలేజీని ప్రియారిటీగా ఎంచుకుంటున్నారని తెలిపారు. అన్ని అడ్మిషన్స్ ప్రభుత్వమే చేస్తుందని అన్నారు. మా బంధువులకు కూడా మేము మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ ఇవ్వలేమన్నారు. పైకి వెల్లేకొద్ది ఇలాగా హై లైట్ కావడం సహజమన్నారు.
Bedurulanka 2012: ‘చిత్ర’గా మారిన ‘రాధిక’
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!