గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదికను హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సంక్షోభం తర్వాత సాధారణ స్థితికి రావడానికి అనేక రంగాలు ఆపసోపాలు పడుతుంటే.. తెలంగాణలో ఐటీ రంగం శర వేగంగా దూసుకుపోతుందని, గత రికార్డులను బద్దలు కొడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను…