ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ పోరు నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ క్రమంలో మిలిటెంట్ చెరలోని తమ బందీలను విడిపించేందుకు టెల్‌అవీవ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కొత్తగా రూపొందించిన ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE)ని పర్యవేక్షించడానికి ఎలాన్ మస్క్‌ని నియమించారు. ఈ నేపథ్యంలో బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మస్క్ ఫోన్‌లో చర్చలు జరిపినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ…
PM Modi: కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ యూఏఈకి వెళ్లారు. COP28 సందర్భంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ప్రధాని భేటీ చర్చనీయాంశం అయింది. హమాస్ యుద్దంలో ప్రభావితమైన ప్రజలకు మానవతా సాయం నిరంతరం అందించాల్సినఅ అవసరాన్ని ప్రధాని మరోసారి పునరుద్ఘాటించారు.
Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ హమాస్ దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లో ఎలాన్ మస్క్ భేటీ అయిన సందర్భంలో ఈయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్, గాజాలో కలిపి 16,000 మందికి పైగా మరణాలకు కారణమైన ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం పరిణామాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో హమాస్ ఉగ్రవాదులను హతమార్చడం తప్ప వేరే మార్గం లేదని ఎలాన్ మస్క్ అన్నారు.