Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ యుద్ధం మూలంగా చమురు సరఫరాపై ప్రభావం పడుతుందని అన్ని దేశాలు భయపడుతున్నాయి. మరోవైపు, శుక్రవారం నుంచి ఇరు దేశాల మధ్య ఘర్షణ ఆరో రోజుకు చేరింది. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో వైమానిక దాడులు చేసింది.