హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్ గా ఉన్న నయీమ్ ఖాసిమ్ ప్రాణ భయంతో లెబనాన్‌ను వదిలి పెట్టినట్లు సమాచారం. డిప్యూటీ చీఫ్ ఖాసిమ్ ఇరాన్‌కు పారిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.
ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలకు అంతూ పొంతూ ఉండటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలపై ఉక్కుపాదం మోపింది. దాడులు, అరెస్టులు, హత్యలతో ఇరాన్ దేశం మొత్తాన్ని ఓ యుద్ద క్షేత్రంలా మార్చింది. సెప్టెంబరులో మహ్సా అమిని అనే యువతి హిజాబ్ సరిగా వేసుకోలేదనే కారణంతో పోలీసులు కొట్టి చంపిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.
ఇస్లామిక్ దేశంలో నేరాలకు శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలసిందే. కన్నుకు కన్ను.. చేయికి చేయి.. ప్రాణానికి ప్రాణం అన్న రీతిలో అక్కడ శిక్షా పద్దతులు ఉంటాయి. ఇప్పటీక ఇరాక్, ఇరాన్, సిరియా, సౌదీ, యూఏఈ వంటి దేశాల్లో బహిరంగంగానే మరణశిక్షలు అమలు చేయబడుతున్నాయి. వీటిపై అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఎన్నిసార్లు గొంతెత్తినా.. ప్రయోజనం లేదు. మధ్యయుగం నాటి ఈ మరణ శిక్షా పద్దతులను విరమించుకోవాలని పలు హక్కుల సంస్థలు కోరుతున్నాయి.