తూర్పు ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మరణించగా, 50 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. తబాస్ సమీపానికి చేరుకున్న తర్వాత రైలులోని ఏడు బోగీల్లో నాలుగు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే.. మూడు హెలికాప్టర్లలో రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి…