టెహ్నాన్ 60 శాతం శుద్ధి చేసిన 400 కిలో గ్రాముల యురేనియం గురించి ఆసక్తికరమైన ఇంటెలిజెన్స్ రిపోర్టు తమకు అందిందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. కానీ, ఆ వివరాలు బయటకు చెప్పడం కుదరదు అన్నారు. తాము హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను చంపేసిన తర్వాత ఇరాన్ అణ్వాయుధాల తయారీ మొదలు పెట్టిందని వెల్లడించారు.