Iran vs America: ఇరాన్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశంపై యూఎస్ సైనిక జోక్యానికి దిగితే, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వార్నాంగ్ ఇచ్చారు.