Donald Trump: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఘర్షణ 5వ రోజుకు చేరుకుంది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ కారణంగా మధ్యప్రాచ్యంతో పాటు ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి విరామం అవసరం లేదని చెప్పారు.