iQOO ఇటీవలే తన ఫ్లాగ్‌షిప్ iQOO 15 ను విడుదల చేసింది. వచ్చే నెలలో, కంపెనీ భారత మార్కెట్లో iQOO 15R ని విడుదల చేస్తోంది. కంపెనీ ఇండియా CEO నిపున్ మార్య ట్విట్టర్‌లో ఒక టీజర్‌ను పంచుకున్నారు, ఫిబ్రవరి చివరి వారంలో ఈ హ్యాండ్ సెట్ లాంచ్ అవుతుందని ధృవీకరించాడు. డ్యూయల్ కెమెరా సెటప్‌తో సహా దాని డిజైన్‌ను కూడా కంపెనీ వెల్లడించింది. అయితే, కంపెనీ ఇంకా దాని స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. iQOO 15R భారత్…
iQOO బ్రాండ్ vivo సబ్-బ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా గేమింగ్, పెర్ఫార్మెన్స్-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్‌లతో యువతను ఆకర్షిస్తోంది. 2025లో iQOO 15 సిరీస్ లాంచ్ అయిన తర్వాత, ఇప్పుడు iQOO 15R మోడల్ గురించి రూమర్లు వస్తున్నాయి. ఇది iQOO 15 సిరీస్‌లో మరో వేరియంట్‌గా, మిడ్-రేంజ్ లేదా పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ మోడల్‌గా రాబోతోంది. iQOO 15R ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు. ఇటీవల Bluetooth SIG సర్టిఫికేషన్‌లో కనిపించింది, దీని మోడల్ నంబర్ I2508. ఇది రాబోయే…