పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ కింగ్స్.. నేరుగా క్వాలిఫయర్ ఆడే అవకాశాన్నీ ఒడిసిపట్టింది. రెండో దశలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన పంజాబ్.. 19 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుకు ఫైనల్ చేరడానికి క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌కు ఫైనల్ చేరేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. పంజాబ్‌పై ఓడిన ముంబై 16 పాయింట్లతో నాలుగో స్థానానికి…
ఐపీఎల్ 2025లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఈ రెండు జట్లు.. టాప్-2లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలో దిగనున్నాయి. ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పట్టికలో 17 పాయింట్లతో పంజాబ్ రెండో స్థానంలో ఉంది. ముంబై 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుకు టాప్-2లో స్థానం…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు అయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాయి. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో ఎనిమిదింట్లో విజయం సాధించిన ఆర్సీబీ.. 17 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో ఉంది. లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండడంతో ఆర్సీబీకి టాప్ 2లో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)…
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు అయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాయి. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచుల్లో ఎనిమిదింట్లో విజయం సాధించిన ముంబై.. 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ముంబై.. రెండో స్థానంలోకి దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది జరగాలంటే పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో ముంబై కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ…
ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కాబోతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీకి గుడ్ న్యూస్. ఏకంగా ఆరుగురు విదేశీ మ్యాచ్ విన్నర్స్ ఐపీఎల్ 2025లో ఆడనున్నారు. రొమారియో షెపర్డ్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జోష్ హేజిల్‌వుడ్, లుంగి ఎంగిడిలు మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నారు. ఇక జేకబ్ బెథెల్ మాత్రమే ఐపీఎల్ లీగ్ దశ అనంతరం ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడు. విషయం తెలిసిన ఆర్సీబీ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి…
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ దూరం కానున్నాడు. జాతీయ జట్టు (ఇంగ్లండ్) తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు మే 26న అతడు స్వదేశానికి వెళ్లనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ చివరి లీగ్ మ్యాచ్ అనంతరం బట్లర్ ఇంగ్లండ్ పయనం కానున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో గుజరాత్ ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. కీలక ప్లేఆఫ్స్‌కు బట్లర్ దూరం కావడం జీటీకి గట్టి ఎదురుదెబ్బే అని…
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. వరుస పరాజయాలు చవిచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత ప్రదర్శన చేస్తోన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువయ్యాయి. లేటుగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నాలుగు టీమ్స్ పాయింట్ల పట్టికలో టాప్ -4లో కొనసాగుతున్నాయి. 10 పాయింట్లతో…
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దారుణ ప్రదర్శన చేస్తోంది. ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన సీఎస్‌కే.. ఆపై వరుసగా ఐదు ఓటములు చవిచూసింది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో అయితే హ్యాట్రిక్ ఓటమిని ఎదుర్కొంది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయాంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వం వహించినా.. సీఎస్‌కే రాత మారలేదు. అంతేకాదు బంతుల పరంగా ఐపీఎల్‌లో అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వరుసగా ఐదు ఓటములతో చెన్నై ఫాన్స్…