ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభానికి మరో రెండు రోజులు మాత్రమే ఉంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ ఆరంభోత్సవాన్ని బీసీసీఐ ఘనంగా నిర్వహించనుంది. ఐపీఎల్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ హాట్ భామ దిశ పఠాని డాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవంలో ప్రముఖ గాయని శ్రేయ…