18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజేతగా నిలిచింది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు సార్లు ఫైనల్లో భంగపడ్డ బెంగళూరు.. నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడంతో అటు ప్లేయర్స్, ఇటు ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇక ఐపీఎల్…