ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో గూగుల్ భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టనుంది. రానున్న ఐదేళ్ల కాలంలో ఎయిర్‌టెల్‌లో గూగుల్ సంస్థ రూ.7,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎయిర్‌టెల్‌లో 1.28 శాతం యాజమాన్య హక్కులను కొనుగోలు చేసేందుకు గూగుల్ ఆసక్తి చూపిస్తోంది. మరో 300 మిలియన్ డాలర్ల మేర ఎయిర్ టెల్‌తో వాణిజ్య లావాదేవీలను గూగుల్ కుదుర్చుకోనుంది. Read Also: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ కాగా 5G నెట్‌వర్క్, తక్కువ ధరకు…
మాజీ సీఎం, ఏపీలో విపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం ఢిల్లీ పర్యటన విజయవంతం అవుతుందని ఓర్వలేక చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏపీకి చేసిందేం లేదన్నారు ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో వందల కోట్లు వేస్ట్ చేశారన్నారు. మీలా డ్రామాలు చేయడం మాకు చేతకాదన్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు.…
ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా ముందడుగు వేసింది. ఫార్మాస్యూటికల్ రంగంలో అతిపెద్దదైన సన్‌ఫార్మా ఏపీలో తయారీ ప్లాంట్ నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ కంపెనీ ఛైర్మన్ దిలీప్ షాంఘ్వి మంగళవారం నాడు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై సీఎం జగన్‌తో ఎండీ దిలీప్ విస్తృతంగా చర్చలు జరిపారు. Read Also: హిందూపురంలో బాలయ్య…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఏపీ సీఎం జగన్ తో ప్రముఖ ఇ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్‌చక్రవర్తి, ఇతర ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృత చర్చ జరిపారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు సీఎం జగన్. విశాఖను పెట్టుబడులకు వేదికగా మలుచుకోవాలన్న సీఎం ఐటీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలన్నారు. సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్‌చక్రవర్తి.…