ఒకప్పుడు ప్రతి తెలుగు లోగిలిలో వైభవంగా వెలిగిన ఉమ్మడి కుటుంబాన్ని మరోసారి తెరపైకి తెస్తూ స్టార్ మా “ఇంటింటి రామాయణం” పేరుతో సరికొత్త సీరియల్ మొదలుపెడుతోంది. ఒక కుటుంబం అంటే ముగ్గురికో నలుగురికో కుదించుకుపోయిన ఈ రోజుల్లో అలాంటి ఉమ్మడి కుటుంబాన్ని చూడడమే ఒక కన్నుల పండుగ. ఆ అపురూపమైన ఇల్లు.. ఓ అచ్చమైన బొమ్మరిల్లు.. ముచ్చటైన పొదరిల్లు. దాదాపుగా 20 మంది వున్న ఆ కుటుంబంలో మనుషుల మధ్య అనుబంధాలు, వాటి ఆనవాళ్లు ఎంత అద్భుతంగా…