స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు షాకిచ్చింది. ఎస్‌బీఐ పెంచిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హోం, పర్సనల్, కారు లోన్‌లపై చెల్లించే ఈఎంఐలు పెరిగాయి. ఎంసీఎల్‌ఆర్‌ను మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అని చెప్పొచ్చు. ఎంసీఎల్ఆర్ ప్రకారం వివిధ బ్యాంకుల్లో ఏదైనా లోన్ తీసుకోవాలంటే.. ఆ లోన్‌లపై మినిమం ఇంత మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెన్యూర్‌ను బట్టి లోన్లపై బ్యాంకులు వడ్డీని విధిస్తాయి.…
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)… తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది.. రికరింగ్ డిపాజిట్లపై (ఆర్డీ) వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది… పెంచిన వడ్డీ రేట్లు ఈ నెల 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చాఇ.. కనీసం రూ.100 డిపాజిట్ కోసం ఎస్బీఐలో ఆర్డీని తెరవవచ్చు. ఈ ఆర్డీ ఖాతాలను 12 నెలల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధితో ఉంటుంది.. ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) లాగానే, సీనియర్…
ఈ మధ్యే వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.. దీంతో రెపో రేటు 4.40 శాతానికి చేరింది. ఇక, ఆర్బీఐ చర్యను ఊహించిన కొన్ని బ్యాంకులు ముందుగానే తమ ఎంసీఎల్ఆర్ రుణ వడ్డీరేట్లు పెంచేశాయి. రెపోరేట్…
రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఊరట కలిగించింది. ఆర్‌బీఐ వరుసగా పదోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సారథ్యంలోని మానిటీరీ పాలసీ కమిటీ గురువారం నాడు కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4 శాతంగా వద్దనే ఉంది. రివర్స్ రెపో 3.35 శాతం వద్ద కొనసాగుతోంది. అదేసమయంలో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25…
పొదుపు ఖాతాదారులకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) బ్యాడ్ న్యూస్ అందించింది. ఖాతాదారులు పొదుపు ఖాతాల్లో చేసే జమపై వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న వడ్డీ రేట్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది. రూ.1 లక్ష వరకు చేసే డిపాజిట్‌పై 2.25% వడ్డీరేటు, రూ.1 లక్ష-రూ.2 లక్షల వరకు జమ చేసే డిపాజిట్లపై 2.50% వడ్డీ మాత్రమే లభిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఈనెల 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు పోస్టాఫీస్…
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు 3 ఇన్ 1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. దీంతో సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారికి ప్రయోజనం చేకూరుతుందని ఎస్‌బీఐ పేర్కొంది. 3 ఇన్ 1 ఖాతాతో వినియోగదారులు మూడు రకాల సదుపాయాలను పొందుతారని సూచించింది.…