ఇసుక.. బంగారం కంటే విలువైందిగా మారిపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి పారుతున్నా ఇసుకకు ఇబ్బందులు తప్పడంలేదు. కొందరు ఇసుకను అక్రమంగా దాచేసి ఆంధ్ర సరిహద్దుల నుండి తెలంగాణాకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. భారీ స్థాయిలో ఇసుకను అక్రమ నిల్వలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు, రాత్రివేళల్లో ట్రక్కుల కొద్దీ ఇసుక తరాలిపోవడాన్ని చూస్తే సరిహద్దుల్లో అధికారుల పనితీరు విస్మయానికి గురిచేస్తోంది, యటపాక మండలంలో కొందరు వ్యక్తులు రాత్రి వేళల్లో ఇసుకను తెలంగాణకు తరిస్తున్నారు,…