కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రెండో ఏడాది కూడా ఇంటర్ పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం… మొదట్లో ఫస్టియర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తాజాగా అధికారులతో సమీక్ష నిర్వహించిన సెకండియర్ ఫలితాలను సైతం రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇక, ఏ ప్రతిపాదికన విద్యార్థులను పాస్ చేయాలన్న దానిపై ఇంటర్ బోర్డు కసరత్తు పూర్తి చేసింది.. వారం రోజుల్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నట్టు తెలిపారు ఇంటర్ బోర్డు…